– 10మీ ఎయిర్ పిస్టల్‌లో కాంస్యం
– భారత్ ఖాతాలో ఐదో మెడల్
– పారిస్ 2024 పారాలింపిక్స్
నవతెలంగాణ-పారిస్
పారిస్ పారాలింపిక్స్‌లో టీమ్ ఇండియా ఖాతాలో ఐదో పతకం చేరింది. రెండో రోజు పోటీల్లో షఉటింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు రాగా.. మూడో రోజు షఉటింగ్ నుంచి మరో మెడల్ లభించింది. రూబినా ఫ్రాన్సిస్ కాంస్య గురితో అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రూబినా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో రూబినా ఫ్రాన్సిస్ గొప్పగా ఆరంభించింది. వరుసగా 10 ప్లస్ స్కోర్లతో ముందంజలో నిలిచింది. నాల్గో స్థానంలో నిలిచిన పారా షఉటర్ ఎలిమినేషన్ సమయానికి రూబినా రెండో స్థానంలో నిలిచింది. దీంతో రూబినా కనీసం సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంటుందనే అనిపించింది.
కానీ ఆఖర్లో రూబినా స్వల్ప తేడాతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఇరాన్ షఉటర్ 236.8 పాయింట్లతో పసిడి పతకం సాధించగా, 231.1 పాయింట్లతో టర్కీ షఉటర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో పతక ఆశలతో బరిలోకి దిగిన రూబినా.. అక్కడ ఫైనల్లో ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. పారిస్‌లో గురి తప్పని రూబినా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది.