మట్టిలో మాణిక్యం సలేంద్ర రాజన్న యాదవ్

– తెలంగాణ సాంస్కృతిక సారధి రాజన్నకు తహశీల్దార్, ఎంపీడీఓలు ఘన సన్మానం
నవతెలంగాణ – మల్హర్ రావు
మట్టిలో మాణిక్యం పెద్దకల్వల గ్రామానికి చెందిన సలేంద్ర రాజన్న యాదవ్ ని పలువురు వివిధ శాఖల అధికారులు అభినందించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి, ఉద్యోగి, పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ సలేంద్ర రాజన్న యాదవ్ ఆటపాటల్లో రాణించే తీరు అభినందనీయమని కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ జహెజ్ బాషా, ఎంపీడీఓ రామ్మోహన్ చారి అన్నారు. గేయ రచయిత, కళాకారుడు రాజన్న యాదవ్ పుట్టినరోజు సందర్భంగా శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్, ఎంపిడిఓ మాట్లాడారు. రాజన్న బాల్యం నుంచి ఒక గొర్లకాపరిగా జీవనం ప్రారంభించి గేయ రచయితగా, కళాకారుగా ఎన్నో పాటలు రాస్తూ, ఆటల్లో రాణించి మట్టిలో మాణిక్యం ఎదుగుదల అభినందనియమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో ఉద్యమాన్ని ఉర్రెగిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధనలో రాజన్న కృషి గొప్పదన్నారు. ఆయన చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల కోఆర్డినేటర్ గా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ మరింతగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ గోవర్ధన్ పటేల్, డిప్యూటీ తహశీల్దార్ దిరిజ్, ఆర్ఐ ఉదయశ్రీ, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, జూనియర్ అసిస్టెంట్లు అన్వర్, మహేష్, ప్రధానోపాధ్యాయుడు సత్యప్రకాస్, పంచాయతీ కార్యదర్శులు, స్వశకి సంఘాల మహిళలు, కళాకారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.