
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
తెలంగాణ గురుకుల కళాశాల జూనియర్ లెక్చరర్ ఫలితాలలో భాగంగా మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి తెలుగు లెక్చరర్ గా ఎంపిక అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనీసం బస్సు సౌకర్యం లేని మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి లెక్చరర్ గా ఎంపికైనా తొలి మహిళ కావడం విశేషం. ఇంతే కాకుండా గత సంవత్సరం కస్తూర్భా బాలికల కళాశాల లెక్చరర్ గా మరియు స్పెషల్ అపిసర్ గా ఎంపికావడం గమనార్హం. దింతో మండల ప్రజలు మరియు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.