మట్టిలో మాణిక్యం..

Ruby in the soil..– గౌతమి నంది అవార్డు అందుకుంటున్న అలకనంద రాథోడ్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన వర్ధమాన నృత్య కళాకారిని బేబీ అలకనంద రాథోడ్ భూపాలపల్లి పట్టణంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో 6వ తరగతి చదువుతూ భరత నాట్యం పట్ల తనకున్న ఆసక్తిని చూపుతూ గత రెండు సంవత్సరాల నుండి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలల్లో తన నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఇప్పటికే జిల్లా స్థాయి,రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి,పలు రకాల అవార్డులను సొంతం చేసుకుంటూ మట్టిలో మాణిక్యంగా నిలుస్తూ 2024 ఉగాది పురస్కారం అందుకుని ప్రముఖుల ప్రశంసలు ఇప్పటికే పొందింది.ఈ నేపథ్యంలో 2024 మే నెల హైదరాబాద్ లో గౌతమేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి సాంస్కృతిక నృత్యకళ  ప్రదర్శన పోటీలలో తన నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుని 2024 గౌతమి అవార్డుతో పాటు జాతీయ స్థాయి ఐకాన్ అవార్డుకి ఎంపికయ్యారు.జులై 28 ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మఖ్య అతిధిగా విచ్చేసినటువండి ప్రముఖ తెలంగాణ సంఖ్యా శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహిత శ్రీ దైవజ్ఞ శర్మ గారి చేతుల మీదుగా 2024 గౌతమి నంది అవార్డు మరియు జాతీయ స్థాయి ఐకాన్ అవార్డుని అందుకున్నారు.కార్యక్రమం అనంతరం దైవజ్ఞ శర్మ మాట్లాడుతు భరత నాట్యం పట్ల బేబీ అలకనందకు ఉన్న నైపుణ్యాన్ని చూసి అభినందించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, గౌతమేశ్వర గోసంరక్షణ సమితి చైర్మన్ విద్యాసాగర్,విశ్వవిఖ్యాత అర్ట్స్ & కల్చరల్ అకాడమి చైర్మన్ ఎస్విఆర్, మన మంథని వెబ్సైట్ డైరెక్టర్ అవదానుల హరిప్రసాద్,విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా,ఉజ్వల,ఎస్ సిసి ఎల్ కోండి కుమార్@మాధవి,ఎస్ సిసి ఎల్ పోషమల్లు,డాక్టర్ శివానంద్@శ్వేత, నాని మాస్టర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.