నవతెలంగాణ – నెల్లికుదురు
కొరివి మండలంలోని బలపాల గ్రామంలో నిర్వహించిన రగ్బీ జిల్లా స్థాయి పోటీల లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి బి సాయి చరణ్ రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆలేరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్ టీఈటి కిషన్ లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన 8వ తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆ పాఠశాల బృందం అభినందించే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొరివి మండలంలోని బలపాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రగ్బీ సబ్ జూనియర్ పోటీలకు ఆలేరు ప్రభుత్వ పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి బి సాయి చరణ్ జిల్లాస్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు. ఆ విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు రాబోయే రెండు రోజులలో రాష్ట్రస్థాయి పోటీలు బోనగిరి యాదాద్రి జిల్లాలో జరగబోతున్నాయని ఆ పోటీలో ఆలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సాయి చరణ్ పాల్గొంటున్నాడని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి బి సాయి చరణ్ పట్ల గ్రామస్తులు ఉపాధ్యాయులు అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి మహేశ్వరి నరసయ్య జబ్బర్ తో పాటు ఉపాధ్యాయ బృందం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.