పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పాలకులు విఫలం..

Rulers fail to complete pending projects.– రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు
ఏళ్ల తరబడి నుండి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం మండలంలోని కొంపెల్లి కల్వకుంట్ల చల్మెడ గ్రామాలలో కౌలు రైతుల సమస్యలపై సర్వే నిర్వహించారు. ప్రభుత్వం అందించే కౌలు రైతులను గుర్తించి రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ ని కౌలు రైతులకు అందించాలని సర్వే ప్రతినిధి బృందానికి కౌలు రైతుల సమస్యలు వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీరు తాగునీరు అందించేందుకు నక్కల గండి డిండి ఎత్తిపోతల పథకం, చర్లగూడెం రిజర్వాయర్ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు పెళ్లికి ప్రాజెక్ట్లను పూర్తి చేస్తామని ఆమె ఇవ్వడం తప్ప అమలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కౌలుకు సంబంధించిన రూ.8000 నుండి రూ.12000 వరకు కౌలు  కథ చెల్లిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో 150 నుండి 60 మంది కౌలు రైతులు వ్యవసాయం లేని ఆధారపడిజీవిస్తున్నారని అన్నారు. వీరికి ప్రభుత్వ నుండి పంట రుణాలు అందడం లేదని, ప్రైవేటు అప్పుల మీదనేఆధారపడివ్యవసాయని సాగు చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వడ్లమూడి  హనుమయ్య, రామారావు, సూర శంకర్, నరసింహ, బొందు నరసింహ, బొందు సుందరయ్య, ఎట్టయ్య, రాజయ్య తదితరులు ఉన్నారు.