
ఉప్పునుంతల మండలం సిబి తాండ గ్రామంలో సిసి రోడ్డు పక్కనున్న డ్రైనేజీ కాలువలో మట్టి పేరుకు పోయి అధ్వానంగా మారి రోడ్డుపై పారుతూ గ్రామ పరిశుభ్రత అంధకారంలోకి వెళ్లి పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత మండల అధికారులా పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేనందున ఈ దుర్భరమైన సమస్యలు కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శి స్పందించి కాలువలోని పేరుకుపోయిన చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించేలా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శినీ చరవాణిలో వివరణ కోరగా.. సిబి తాండ గా ఉన్న కార్యదర్శి కుటుంబ అనారోగ్య సమస్యతో సెలవుల్లో ఉన్నారు. నేను సిబి తాండ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకొని నాలుగు రోజులు అయింది. గురువారం ఉదయం గ్రామంలోకి వెళ్లి డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరిస్తాం అని తెలిపారు.