– శ్రీ లక్ష్మి నరసింహాస్వామి ఆలయాకమిటి సభ్యులు
నవతెలంగాణ- దర్పల్లి : మండలకేంద్రానికి చెందిన మద్దుల్ అటవీ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కంటి సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికు శనివారము ఆలయంలో ఘనంగా సన్మానించారు. ముందుగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరము సన్మాన కార్యక్రమము నిర్వహించారు. అనంతరము ఆలయం వద్దా రేకుల షెడ్డు నిర్మాణం కొరకు, అలాగే ఆలయ ఆవరణలో సిసి నిర్మాణపు పనులకు నిధులు అందించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కమిటీ సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమములో మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, నాయకులు మనోహర్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పాల సుభాష్, మచ్చ నారాయణ, ఇమ్మడి గోపి చెలిమేల శ్రీనివాస్, ఆలయాకమిటి అధ్యక్షుడునాగాయ్యోల్లా గంగారెడ్డి, కచ్చకాయల బాలు, మంచికంటి ప్రశాంత్, దాసు, రాజు, సాయిలు, రాజ్ కుమార్, పోత రాజు, నరేష్, కిషన్,, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.