నవతెలంగాణ – మోపాల్
మంగళవారం రోజున రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మోపాల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే రూ.20 లక్షల రూపాయలతో హెల్త్ సబ్ సెంటర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితోపాటు కంజర్ గ్రామ శివారులో నిర్మించిన సొసైటీ గోదామును మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రైతులకు మహర్దశ ప్రారంభమైందని నాణ్యమైన విత్తనాల అందించడంలోనూ మరియు రైతులకు సరైన సమయంలో ఫర్టిలైజర్ అందించడంలోనూ ప్రభుత్వం రైతులకు చేయూతనందించిందని. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా దాచుకోవడం దోచుకోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని కేవలం రైతుల ,ప్రజల సంక్షేమమే తమ కర్తవ్యం అని ఆయన తెలిపారు. కేవలం మన నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని మొత్తం రాష్ట్రంలో ఒక కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఇంత దిగుబడి రావడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారీ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఇంత దిగుబడి ఏరోజు రాలేదని రైతులకు 24 గంటలు ఉచిత రెంట్ ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కచ్చితంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే దాన్యం విక్రయించాలని కచ్చితంగా రూ.500 రూపాయల బోనస్ పొందాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ హయంలోని రైతును రాజ్యం చేస్తున్నామని రైతులకు కొనుగోలు విషయంలో గ్యారెంటీనీ అందజేస్తున్నామని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చాలా నష్టపోయారని 10 కిలోల కర్త తీసిన సమయంలో రైతుల ఎంతో బాధపడ్డారని కానీ మన ప్రభుత్వంలో అలా కాకుండా ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుండి కవిత తీయకుండా చూస్తామని రైతు ఆనందంగా ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఐదు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని బిఆర్ఎస్, బిజెపి రెండు ఒకటే అని, వారి మాటలను రైతులు ప్రజలు మోసపోవద్దని కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటివరకు రూ.18,000 కోట్ల రుణమాఫీ జరిగిందని అన్నారు. రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ నెల ఆఖరిలో ఇంకో ఐదు వేల కోట్లతో వారికి కూడా మాఫీ చేస్తామని మిగతావారు కూడా ధైర్య పడద్దని వారికి కూడా అతి త్వరలో కచ్చితంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారము రుణమాఫీ చేసి తీరుతామని ఆయన తెలిపారు. అలాగే 125 కోట్ల రూపాయలతో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి అతి త్వరలో ఏర్పాటు చేయనున్నారని దీని వల్ల కుల మాత సామరస్య లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లందరూ ఒకటే దగ్గర చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఇటువంటి పనులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని దాన్ని వడ్డీ యే నేలకు పెద్ద మొత్తంలో కట్టాల్సి వస్తుందని, కేవలం కుటుంబ కొరకు దోచుకోవడమే తప్ప ప్రజల గురించి యేరోజు ఆలోచించింది లేదని కేటీఆర్ ని మరియు హరీష్ రావు ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇద్దరు పెద్ద 420లని, తోడుదొంగలని వారి ఆస్తులు వేలకోట్ల పెంచుకున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించలేదని అన్నారు.
యేంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వంపై యేడవడమే తప్ప వారు చేసింది ఏమీ లేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎటువంటి దళారి వ్యవస్థ ఉండదని ఇది ప్రజా ప్రభుత్వమని రైతు ప్రభుత్వమని రానున్న రోజుల్లో రైతులకు ఇంకా అనేక సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని కచ్చితంగా వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని , గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, మోపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, భాస్కర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రసాద్, సతీష్ రావు, అనిల్ రెడ్డి,పి శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.