
గ్రామీణ ప్రాంతాల్లో తపాలా శాఖ తీసుకువచ్చిన జీవిత భీమా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరం లాంటిదని పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ సూపర్డెంట్ రాజా నరసింహ గౌడ్ అన్నారు. ఇటీవల నాయుడుపాలెం గ్రామానికి చెందిన ముడావత్ జగన్ నాయక్ రోడ్ ప్రమాదం లో లో మరణించారు మరణించిన జగన్ నాయక్ 11 నెలల క్రితం హజార్ గూడెం గ్రామ తపాలా శాఖ లో జీవితభీమా చేశారు.ఈ భీమా ద్వారా 8,30,470 రూపాయలను ఆయన భార్య ముడావత్ పార్వతి కి పోస్టల్ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా రాజా నరసింహ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కుటుంబంలో ఎవరైనా అకాల మరణం చెందితే ఈ జీవిత భీమా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ నరసింహారెడ్డి, హజారి గూడెం బీపీఎం శ్రీనివాస్ రెడ్డి, రామడుగు బీపీఎం మంచికంటి శ్రీనివాస్, ఏబీపీఎం సయ్యద్ నుస్రత్ రఫీ, గ్రామస్తులు షేక్ జలీల్ పాషా, వీర్రాజు, జానపాటి బుగ్గయ్య, సత్యనారాయణ, చిమట బాల సైదులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.