తెలంగాణ స్టేట్ చెస్ చాంపియన్షిప్ లో సత్తా చాటిన గ్రామీణ విద్యార్ధిని…

– సాయి స్ఫూర్తి స్కూల్ విద్యార్థిని భవ్యశ్రీ లక్ష్మీ కి అభినందనల వెల్లువ…
– ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన రాజ్య సభ సభ్యులు బండి పార్థ సారథి రెడ్డి గారు….
నవతెలంగాణ – అశ్వారావుపేట : హైదరాబాదు లాల్ బహదూర్ స్టూడియో లో ఈ నెల 10 నుండి 11వ తేదీ వరకు రెండు రోజులు పాటు తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో సాయి స్ఫూర్తి డి.ఎ.వి స్కూల్ విద్యార్థిని కేశిబోయిన  భవ్యశ్రీ లక్ష్మీ అద్వితీయమైన ప్రతిభ కనబరిచింది.
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి తణుకు శేష సాయి శ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నుంచి మొత్తం 500 వందల మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనగా అండర్ 13 విభాగంలో మా విద్యార్థిని కేశిబోయిన భవ్యశ్రీ లక్ష్మి 51వ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.
తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ఎస్. ప్రసాద్ చేతుల మీదుగా విజేత మెడల్, సర్టిఫికెట్లను అందుకున్నట్లుగా తెలిపారు. క్రిటికల్,ఎనాలిటికల్ గా ఆలోచించే శక్తిని ఛెస్ గేమ్ కలిగిస్తుందని చెప్పారు.  విజేతను ప్రోత్సాహం ఇచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులను,స్కూల్ చెస్ కోచ్ పాలూరి కిరణ్ కుమార్ ని, పి ఈ టి కె. కుమారస్వామి,  ఎ.సత్య స్వరూపిణి లను, సాయి స్ఫూర్తి హానరరీ చైర్మన్,రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, డి.ఎ.వి తెలంగాణ జోన్ సి&డి రీజనల్ ఆఫీసర్ శ్రీ వి.ఎన్.ఎన్.కె. శేషాద్రి, సాయి స్ఫూర్తి డి.ఎ.వి స్కూల్ చైర్మన్ దాసరి ప్రభాకర్ రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద, సాయి స్ఫూర్తి కళాశాల డైరెక్టర్ డాక్టర్.సి.హెచ్. విజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.