– సాగు భూమికే రైతు బంధు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని రైతు వేదికలో బుధవారం వ్యవసాయ అధికారులు రైతులతో రైతు బంధు పథకం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజు చేయడమే ధ్యేయంగా అమలు చేసిన రైతు బంధు పథకాన్ని గత ప్రభుత్వం రైతుబంధు పథకం ఎక్కువ పెద్ద భూ స్వాములకే లాభం చేకూర్చుందని తెలిపారు. రైతు కిష్టారెడ్డి మాట్లాడుతూఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని సూచించారు.అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ రైతు బంధు పథకం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలని, గత ప్రభుత్వం గుట్టలకు రోడ్లకు, వెంచర్లకు పెద్ద పెద్ద భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం జరిగిందని సూచించారు.కష్టం చేసే రైతుకు ఫలితం లేకపోయిందని సూచించారు. రైతుబంధు అనేది నెల ముందు ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలని సూచించారు. వ్యవసాధికారులు రైతుల యొక్క వారి వారి అభిప్రాయాలను సేకరించి నివేదికను పంపిస్తామని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారి లక్ష్మీనారాయణ,ఏడిఏ లక్ష్మీ ప్రసన్న, చైర్మన్ హనుమంత్ రెడ్డి,మండల అభివృద్ధి అధికారి నదిముద్దీన్, సిఈఓ సందీప్, వ్యవసాయ అధికారులు రూప,సిబ్బందిలు,రైతులు, పాల్గొన్నారు.