రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి అమలు చేయబోయే రైతు భరోసా పథకంపై మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న సాగు భూముల పరిశీలన కార్యక్రమంలో భాగంగా పడిత్ భూముల పరిశీలన మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ సుల్తాన్ పేట్ గ్రామాన్ని సందర్శించి అధికారుల సర్వేలను తనిఖీ చేశారు. భూ సర్వేలు పకడ్బందీగా చేపట్టాలని సర్వే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈఓ శివలింగ రెవెన్యూ అధికారులు రవికుమార్ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.