కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా పథకం హామీలో భాగంగా రైతులకు తక్షణమే 15 వేల రూపాయలను అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి అన్నారు.ఏర్గట్ల మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాల మీద గద్దెనిక్కిందని ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రైతు భరోసా కింద 15 వేల రూపాయలు అందజేస్తామన్నారని,ప్రస్తుతం రైతులకు 12 వేల రూపాయలను మాత్రమే ఇస్తాననడం విడ్డురంగా ఉందని అన్నారు.దేవుళ్ళపై ఒట్టేసి అబద్దాలు ఆడుతూ..ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని,మాట ఇచ్చిన ప్రకారం రైతులకు 15 వేల రూపాయలు పంట సహాయం కింద ఇవ్వకుంటే,ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ, రైతుల తరపున నిలబడి రైతు ఉద్యమాన్ని చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.