‘రైతుబీమా’ రైతు కుటుంబానికి కొండత అండ

– రైతుబీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
– జులై 10 నుండి ఆగస్టు 5 వరకు గడువు
నవతెలంగాణ-దోమ
రైతులకు రైతుబీమా కొండంత అండ అని మం డల ఏవో ప్రభాకర్‌ రావు అన్నారు. రైతుబీమా పథకం 2023 -24 సంవత్సరానికి గాను కొత్తగా భూ మి రిజిస్టర్‌ చేసుకున్న రైతులు, ఇంతకుముందు రైతు బీమా చేసుకుని రైతులు ఈ సంవత్సరం రైతుబీమా (రైతు మరణిస్తే వచ్చే రూ.5 లక్షల బీమా) చేసుకో వడానికి అవకాశం ఉన్నది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని రైతులకు వారు తెలిపారు. రైతు భూమి 18.06.2023 లోపు రిజిస్టర్‌ చేసుకుని ఉండా లన్నారు. రైతులు 18-59 ఏండ్లు ఉండాలనీ, వయస్సు పక్కాగా ఆధార్‌కార్డ్‌ ప్రకారమే తీసు కుంటా రని ఆధార్‌ కార్డులో ఎలా ఉంటే అదే ప్రామా ణికమనీ, ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరి లో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంద న్నారు. రైతే స్వయంగా వచ్చి నామినేషన్‌ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్‌ పుస్త కం, ఆధార్‌కార్డ్‌, నామినీ ఆధార్‌కార్డ్‌ జిరాక్స్‌ ఏఈఓలకు అందజేయాలన్నారు. ఇప్పుడు బీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు బీమా చేసుకో వడానికి అవకాశం ఉండదన్నారు. రైతు కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉండి అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుం బాలు రోడ్డున పడకుండా ఉండేందుకు వారికి చేదోడుగా నిలిచేందుకు ప్రభుత్వం బీమా పథకా న్ని అమలు చేస్తోంది. మృతుడి నామినీకి రూ.5 లక్షల బీమా వర్తిం చేలా నిర్ణయించారు. కర్షకుడు చనిపోయి నపుడు వ్యవసా య అధికారులు వివరాలు సేకరించి నామినీ ఖాతాలో పరి హారం జమయ్యేలా చేస్తున్నారు. తొలి రెండేళ్ల పాటు బీమా కుశాఖ నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించారు. 2020 నుంచి ప్రతి వానాకాలంలో ఒకసారి మాత్రమే అర్హుల నుంచి సేకరిస్తుండటం గమనార్హం. ఇందులో భా గంగా తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ప్రకటన వెలు వడింది. పథకంలో చేరిన రైతు పేరిట ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.3,457 ప్రీమియం చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టి రైతుబీమా పథకం 2023-24 సంవ త్సరానికిగాను మండల వ్యవసాయ కార్యాల యంలో దర ఖాస్తు తీసుకోబడునని తెలిపారు. రైతుబీ మా దరఖాస్తు ఇవ్వని నమోదు చేసుకొని, రైతులకు రైతుబీమా వర్తించ దన్నారు. రైతులకు ఏమైనా సందే హలు ఉంటే మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.