రైతుబీమా రైతుకు కొండంత ధీమా

Rythu Bima is as slow as a hill for a farmer– 7500 మందికి రెన్యువల్‌
– కొత్తగా సుమారుగా 500 మంది దరఖాస్తు
– మొత్తం అర్హులు 8వేల మంది
నవతెలంగాణ-శంకర్‌పల్లి
వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబంలో రైతుబీమా పథకం చేదోడుగా నిలుస్తోంది. కుటుంబంలో భాగంగా అకస్మాత్తుగా జరగకూడని ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇలాంటి వారికి అండగా ఉండా లని ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తుంది. 2018 ఆగస్టు 14న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబమా పథకాన్ని ప్రారం భించింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. అందలో భాగంగా రైతు బీమాకు అవసరమైన ప్రీమియం చెల్లించేందుకు నిధులు కేటాయించింది. రైతు బీమా పథకంలో భాగంగా ఎవ్వరైన ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందితే, 10 రోజుల్లోనే రూ.5 లక్షలు ప్రభుత్వం అందజేస్తుంది. ఆ రైతు కుటుంబంపై ఏలాంి భారం పడకుండా ప్రభుత్వమే రైతు బీమా ప్రీమియం చెల్లించనుంది.
మండలంలో అర్హులైన రైతులు 8వేల మంది
శంకర్‌పల్లి మండలంలో ప్రస్తుతం రైతు బీమా పథకం కింద సుమారు 8వేల మంది అర్హులు ఉన్నారు. వీరిలో 7500 మంది పాతవారు కాగా, కొత్తగా సుమారు 500 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలోని 7500 మందికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. కొత్తవారి కోసం ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పంచింది.ఈ అవకాశాన్ని మండలంలో సుమారుగా 500 మంది సద్వినియోగం చేసుకున్నారు. పాత,కొత్త వారు కలిసి ప్రస్తుతం మండలంలో సుమారుగా 8 వేల మంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. వీరందరికీ రైతుబీమా పథకం వర్తించనుంది.
పథకాలు సద్వినియోగించుకోవాలి
కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చన రైతులు గతంలో దరఖాస్తు చేసుకోలేని వారందరూ బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగించుకోవాలి.
సురేష్‌ బాబు, వ్యవసాయ అధికారి శంకర్‌పల్లి