రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం : ఝాన్సీ రెడ్డి

నవతెలంగాణ – రాయపర్తి
రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యమౌతుందని కాంగ్రెస్  పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి  అన్నారు. శనివారం మండలంలోని పలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పరిశీలించారు. తదుపరి కొలనుపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సుమారు 50మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమె వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి నాణ్యతగా ఉంటే బిఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ లకు కక్కుర్తి పడి నిర్మించిన ప్రాజెక్టులు నెలలు గడవకముందే శిథిలావస్థకు చేరడం శోచనీయం అని ఎద్దేవా చేశారు. గతం నుండి ప్రస్తుతం వరకు రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయడం తధ్యం అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పిదప  కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రశిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు ఆమ్యా నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మాచర్ల ప్రభాకర్, మచ్చ నీలయ్య, నర్సిరెడ్డి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.