
భిక్కనూరు పట్టణ కేంద్రంలో గ్రామ శివారులో రైతు వేదికను వెంచర్ లో గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలో నిర్మించారు. రైతు వేదిక రోడ్డుపై వెళ్లే వారికి రైతు వేదిక కనపడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాత ఎన్ హెచ్ 7 రోడ్డు పై నిలబడి చూసిన రైతు వేదిక కనబడకుండా చెట్లు అడ్డం ఉండడం, రోడ్డు ప్రక్కన ఎలాంటి బోర్డు లేని కారణంగా వ్యవసాయ పనుల కొరకు రైతు వేదికకు వెళ్లే వారికి ఎక్కడ ఉందో తెలియక తికమక పడుతున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి రోడ్డు పక్కన రైతు వేదిక కార్యాలయ బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుచున్నారు.