రైతు రుణమాఫీ వలన పండుగలా మారిన రైతు వేదికలు 

Rythu Vedikas turned into festivals due to farmer loan waiver– వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు 
నవతెలంగాణ – మిరుదొడ్డి 
తెలంగాణ రాష్ట్రంలో నేడు పండుగ వాతావరణం నెలకొందని మాజీ ఎంపీపీ సాయిలు ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశం అన్నారు.  మిరుదొడ్డి మండల కేంద్రంలో రైతు వేదికలో వ్యవసాధికారి మల్లేశం ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు, రైతులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. మళ్లీ రేవంత్ రెడ్డి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడంతో రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని సంతోషం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే కాంగ్రెస్ ప్రభుత్వంకి అండగా రైతాంగం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, భూమా గౌడ్, కనకరెడ్డి, కిష్టయ్య ,సురేష్ ,భూపతి గౌడ్ ,రాజు ,సుదర్శన్ తో పాటు వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.