
మద్నూర్ రైతు వేదిక యందు బుధవారం నాడు రైతు నేస్తం కార్యక్రమం (వీడియో కాన్ఫరెన్స్ దృశ్య శ్రవణ విధానం ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక విధానం)పై అవగాహన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఇంచార్జ్ ఏడిఏ కిషన్ మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు, మద్నూర్ పిఎసిఎస్ చైర్మన్, శ్రీనివాస్ పటేల్, వైస్ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్, ఆయా గ్రామాల ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్లు, ఆయా గ్రామాల రైతులు మద్నూర్ రైతు వేదిక ఏ ఈ ఓ ప్రియాంక తో పాటు ఆయా క్లస్టర్ రైతు వేదిక ల ఏ ఈ ఓ లు సతీష్, అనిల్, నందేవ్, బజాన్న, గజనన్,సంయుక్త, రైతులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రజప్రతినిధులకు, పత్రిక ,మీడియా మిత్రులకు, అధికారులకు మా వ్యవసాయ శాఖ బిచ్కుంద ఏడిఏ కిషన్ మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు మండలంలోని వ్యవసాయ క్లస్టర్ల ఏ ఈ ఓ లు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.