
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నాంపల్లి మౌలానా ఆజాద్ మెమోరియల్ ప్రభుత్వ మోడల్ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ ఎస్. హిమబిందు తెలిపారు. గురువారం నాంపలి లోని మౌలానా ఆజాద్ మెమోరియల్ ప్రభుత్వ మోడల్ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ గా ఎస్ హిమబిందు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్ , ఉర్దూ మీడియాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, సీఐసీ, హెచ్ ఇసీ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సు ఉన్నాయన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కళాశాల లో విద్యార్థులకులైబ్రరీ అందుబాటులో ఉందన్నారు. విద్య బోధన అందించేందుకు లెక్చరర్స్, తగినంత ఫ్యాకల్టీ ఉన్నారని తెలిపారు