జిల్లా సహకార అధికారిగా ఎస్. పద్మ

– స్వాగతం పలికిన ఉద్యోగులు
నవతెలంగాణ – సూర్యాపేట
జిల్లాలో పనిచేసిన జిల్లా సహకార అధికారి  ఎన్. శ్రీధర్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో నూతనముగా బదిలీపై వచ్చిన ఎస్.  పద్మ జిల్లా సహకార అధికారి గా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో  జిల్లా సహకార కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది గౌరవప్రదంగా ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో జిల్లాలో ఎలాoటి సమస్యలు తలెత్తకుండా సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.