
ఎలక్షన్ కోడ్ నేపథ్యం లో పసర పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. శనివారం పసర గ్రామ సరిహద్దులోని అటవీశాఖ చెక్ పోస్టు వద్ద సిబ్బందితో కలిసి ముమ్మరంగ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో డబ్బు మద్యం సరఫరాను అరికట్టడానికి ఈ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఈ వాహన తనిఖీ జరుగుతుందని వాహన యాజమాన్యం పోలీసు సిబ్బందికి సహకరించాలని అన్నారు.