ఆదిలాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ సివిఎన్ రాజును సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు కలిశారు. బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కలిసి శాలువ, పూల బొకేతో సన్మానించారు. ఈ సందర్భంగా సార్క్ హ్యూమన్ రైట్స్ గురించి కమిషనర్ కు వివరించారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి ఉదయ్ కిరణ్, జిల్లా చైర్మన్ రాజ్ సిద్ధార్థ్, సభ్యులు శివకుమార్, షేక్ ఆలం సందీప్ లు పాల్గొన్నారు.