ఎంసీపీఐ(యూ) నుంచి సబ్బని కృష్ణ బహిష్కరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సబ్బని కృష్ణను బహిష్కరిస్తున్నట్టు ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి ప్రకటించారు. ఆయన పార్టీ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి పని చేయకుండా ఒంటెద్దు పోకడలతో పని చేస్తూ పార్టీకి నమ్మక ద్రోహం చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు ఏడాది కాలం నుంచి క్రమశిక్షణ రాహిత్యాన్ని సరి చేసుకోవాలంటూ హెచ్చరించినా ఆయన పనితీరులో మార్పు రానందునే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.