సబ్కా సాత్ సోబ్క వికాస్ బీజేపీతోనే సాధ్యం..

– అస్సాం ఎమ్మెల్యే తరంగ గోగోయ్…దినేష్ కుమార్..

నవతెలంగాణ -డిచ్ పల్లి
దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్కా సాత్ సోబ్క వికాస్ అనే నినాదంతో అభివృద్ధి కి నీధులను మంజూరు చేసిందని, సాబ్ క సాత్ సోబ్క వికాస్ ఒక బీజేపీ తోనే సాధ్యమని, ఈసారి తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తుందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆరు నూరైనా నెరవేర్చడానికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని అస్సాం ఎమ్మెల్యే తరంగ గోగోయ్, బిజెపి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జి కులచారి దినేష్ కూమార్ అన్నారు.గురువారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో మండల స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తరంగ గోగోయ్, కులచారి దినేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లు  ఎన్నికల అఫిడవిట్  లో తమకు నివాస గృహాలు లేవని పేర్కొని నేడు ఎన్నో గృహాలను నిర్మించుకున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోపే మంచిప్ప రిజర్వాయర్ నుండి ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తానని చెప్పినా ఇప్పటికీ నీరు ఇచ్చింది లేదన్నారు. మండలంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా ప్రజలకు మభ్యపెడుతున్నారని ఎద్దేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రహదారుల నిర్మాణానికి ,బియ్యం, స్మశాన వాటికలు తదితర వాటికి నిధులు అందజేస్తుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఎలాగైనా గేలువలనే ఒకే ఒక కారణంతో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఉత్తుత్తి కాగితాలు చేతుల్లో పెడుతున్నారని, అలా కాకుండా దమ్ము ఉంటే ఇచ్చే కాగితాల పై ఉన్న నీదులను ముందస్తుగా వారి అకౌంట్లో వేసి పనులు జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. దళిత బంధు, ఇతర బంధు లతో ఇదిగో,అదిగో అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎ ఒక్క బంధు గ్రామంలో ఎవరికైనా ఇచ్చిన దాఖలలు లేవని దినేష్ కుమార్ మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నిరంతరంగా కొనసాగిస్తామని ఇదే విషయమై ప్రతి కార్యకర్త సైనికుల పని  చేయాలని ప్రతి ఇంటి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పతాకాలను ఇస్తున్న నిధులను వివరించే విధంగా చూడాలని సూచించారు. అనంతరం పలువురు బిజెపితో చేరారు ఈ సమావేశంలో బీబీజేపీ ఇందల్ వాయి మండల అధ్యక్షులు నాయుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎస్ గంగారాం, ఉపాధ్యక్షులు చిన్ను, జి శ్రీనివాస్, గన్నారం సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సవిత, జగత్ పవర్, అసెంబ్లీ కన్వీనర్ పద్మా రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.