అచ్రేకర్‌ స్మారకాన్ని ఆవిష్కరించిన సచిన్‌

Achrekar Memorial Invented by Sachinముంబయి: సచిన్‌ టెండూల్కర్‌ చిన్ననాటి కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ స్మారకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. శివాజీ పార్క్‌లో ఆయన జయంతి సందర్భంగా ఈ స్మారకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌ థాకరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌ మాట్లా డుతూ.. క్రికెట్‌కు, తన జీవితానికి ఎంతో మేలు చేసిన ఆ మహనీయుని స్మారకాన్ని ఆవిష్కరించి, నివాళి అర్పించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. అచ్రేకర్‌ అందించిన సేవలకు గుర్తింపుగా 1990లో ఆయనకు ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య, 2010లో పద్మశ్రీ పురస్కాలు దక్కాయి. 2019 జనవరి లో అచ్రేకర్‌ మరణించారు. అచ్రేకర్‌ సచిన్‌తో పాటు వినోద్‌ కాంబ్లీ, సంజరు బంగర్‌, రమేశ్‌ పవార్‌, అజిత్‌ అగార్కర్‌ లాంటి ఎంతో మందిని క్రికెటర్లను తీర్చిదిద్దారు.