
ఇటీవల విడుదలైన పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన మండల కేంద్రంలోని నాగార్జున ఉన్నత పాఠశాల విద్యార్థిని శాదం అనన్య రెడ్డిని గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఎస్ వెంకట్రావు చేతుల మీదుగా మెమొంటోను,ప్రశంస పత్రమును అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతిలో కనబరిచిన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ జీవితంలో ఉజ్వల భవిష్యత్తుపై ముందడుగు వేయాలని వారు దీవించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్,మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారగాని వెంకట్ గౌడ్,ఉపాధ్యాయులు గుర్రం యాదగిరి గౌడ్,విద్యార్థిని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.