– ఈనెల 22న మీ సేవలో స్లాట్ బుకింగ్ ..
– జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కృష్ణన్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జులై నెలలో సదరం క్యాంపులకు సంబంధించి ఇదివరకు మీ సేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకున్న వారు జులై నెలలో నిర్వహించే సదరం క్యాంపులకు తప్పకుండా హాజరుకావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఎంఎ కృష్ణన్ కోరారు. ఆర్థోపెడిక్ శారీరకలోకం ఉన్నవారు 25 , 27, 30 తేదీలలో హాజరు కావాలని ఒక్కొక్క క్యాంపులో కొత్తవి 50, రెన్యువల్ 20 ఉన్నట్లు తెలిపారు. వినికిడి లోపు ఉన్నవారు 23వ తేదీన, కొత్తవి 50, పాతవి 20, కంటిలోపము ఉన్నవారు 30వ తేదీన కొత్తవి 30, పాతవి 10, మానసిక రుగ్మత ఉన్న వాళ్ళు 24వ తేదీన కొత్తవి 40, పాతవి 10 స్లాట్స్ ఉన్నట్లు తెలిపారు. మోకాళ్ల నొప్పులు, వంటి నొప్పులు, ముసలితనంతో బాధపడుతున్న వారు గుండె కిడ్నీ లివర్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ దివ్యకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు సదర క్యాంపుకు దరఖాస్తు చేసుకోకూడదని తెలిపారు. అర్హత ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సంబంధిత డాక్టర్లచే పరీక్షించి వికలత్వ శాతాన్ని నిర్ధారించిన తర్వాతనే సదరం సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని, ఒకవేళ డాక్టర్ అత్యవసర పరిస్థితిలో అందుబాటులో లేనియెడల ఆరోజు జరిగే సదరం క్యాంపు రద్దు చేయబడుతుందని, మీసేవ కేంద్రంలో బుక్ చేసుకుని మెసేజ్ వచ్చిన వారు మాత్రమే ఏరియా హాస్పిటల్ భువనగిరి కి ధృవీకరణ పత్రాలతో అనగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, డాక్టర్ రిపోర్టులు తీసుకొని క్యాంపుకు హాజరుకావాలని కోరారు. మీ సేవలో జూలై 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.