ప్రకృతి ఒడిలో ఉదయించే పూలను అలంకరించి వాటిని భక్తి శ్రద్ధలతో పూజించి జరుపుకునే పండుగ బతుకమ్మ అని ఎంపిపి కూర మాణిక్యరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నకోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో 7రోజులలో సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ అనీ, దీంతో ఉదయమే మహిళలు, చిన్నారులు పువ్వులను తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చి అందరూ ఒకచోట చేరి బతుకమ్మ పాటలతో, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనా బతుకమ్మను ఆటపాటలతో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటారని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న మండల ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దసరా పండుగ అందరి జీవితాల్లో ఆనందాలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.