ప్రకృతి ప్రసాదించిన తీరోక్క పూలను బతుకమ్మగా ఆలకరించిన పూలలోనే గౌరమ్మను దైవంగా భావించి పూజించే సంస్కృతి సద్దుల బతుకమ్మ పండుగ ప్రత్యేకత.మండలంలోని మహిళలు,యువతులు బతుకమ్మను పూలతో అలంకరణ చేసి సద్దుల బతుకమ్మ పండగ వేడుకలను అదివారం ఉత్సహంగా జరుపుకున్నారు.పురాతన కాలం నుండి అనాధిగా వస్తున్న రామనేసి రామ ఉయ్యాలో..రామ రామ ఉయ్యాలో అనే గేయాన్ని మహిళలు,యువతులు అలపిస్తూ బతుకమ్మ పండుగను కన్నులపండువగా జరుపుకున్నారు.అనంతరం అయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఘాట్ ల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు.