టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటిన ‘సాధన స్కూల్‌ ‘ విద్యార్థులు

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షాపూర్‌ నగర్‌, సంజ రు గాంధీ నగర్‌లోని ” సాధన స్కూల్‌ ” విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. పాఠశాలకు చెందిన జీ మాధవి, టీ దివ్య 10/10 జీపీఏతో పాఠశాల టాపర్లుగా నిలిచారు. సుభాంగి సాగర్‌ 9.8/10, హిరా 9.8/10, అర్పిత దాస్‌ 9.7/10, ఎం సుధా రాణి 9.3/10, ఎన్‌ వసంత 9.2/10, వీ ఉమా 9.0/10, సమీరా బేగం 8.7/10, ఎం అక్షిత 8.5/10, ఎం మౌనిక 8.5/10 , ఏ వైష్ణవి 8.3/10, సయ్యద్‌ సమీనా 8.2/10, సహెర బేగం 8.0/10, అయేష్‌ బేగం 8.0/10 జీపీఏ సాధించినట్టు కరస్పాండెంట్‌ జి రాజులు తెలిపారు. పాఠశాల విద్యార్థుల ప్రతిభ కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. తమ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. ప్రతిష్టమైన అకాడమిక్‌ ప్రణాళిక, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల, అధ్యా పకుల ప్రోత్సాహం, క్రమశిక్షణతో కూడిన విద్య విధానమే తమ విజయానికి కారణం అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బహుమ తులు అందించి అభినం దించారు. అనంతరం స్కూల్‌ ఆవరణలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.