సద్గురు రోహిదాస్ మహారాజ్ జయంతి వేడుకలు 

నవతెలంగాణ – మద్నూర్ 

మద్నూర్ మండల కేంద్రంలోని  మోచి కాలనీలో ఆదివారం నాడు సద్గురు రోహిదాస్ మహారాజ్ 647 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు రోహిదాస్ మహారాజ్ చిత్రపటానికి మోచి కులస్తులు నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ సద్గురు రోహిదాస్ మహారాజ్ అందించిన సేవల గురించి కొని ఆడారు జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు   అన్న ప్రసాదం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, దిలీప్, జీవన్, రవి యువకులతో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.