
మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు సాధు గూడెం మున్నూరు కాపు బెడ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు బోనాల పండుగ అంగరంగ వైభోగంగా భక్తిశ్రద్ధలతో బేడ మహిళలు, పురుషులు, చిన్నారులు, ఘనంగా జరుపుకున్నారు. పురుషులంతా రైతు టావేళ్ళు నూతన వస్త్రాలు ధరించి బోనాల పండుగకు బయలుదేరారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ బోనాల పండుగకు సాధు గూడెం మున్నూరు కాపులు ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామ ప్రజలకు గ్రామ దేవతలు సుఖసంతోషాలతో ఉంచాలని పాడి పంటలు అనుకూలంగా పండాలని సాధు గూడెం బేడ భక్తులు కోరుకున్నారు.