
సఫాయి మిత్ర సురక్ష సివిర్” కార్యక్రమంలో భాగంగా ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామస్థాయి పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలను గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ చేతులు శుభ్రంగా కడుక్కోనే విధానాన్ని మరియు చేతులకు గ్లౌజులు వేసుకోవాలని మాస్క్ వేసుకొని చెత్త సేకరణలో పాల్గొనాలని తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేయాలని అవగాహన కల్పించారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని వారి వద్ద పారాసెటబుల్ మాత్రలు తీసుకొని రక్త పరీక్షలు నిమిత్తము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయికి రావాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయిలో డాక్టర్ వినీత్, డాక్టర్ మానస 96 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్రవంతి, కావ్య, సుచరిత, దీప్తి ,కీర్తన ఆరోగ్య సిబ్బంది ఆనంద్ స్టాఫ్ నర్సులు గంగమని ,ప్రకాష్ ఫార్మసిస్టు విజయలక్ష్మి పాల్గొన్నారు.