నవతెలంగాణ-నవీపేట్: నవీపేట్ మండల కేంద్రంలో సఫాయి కార్మికులు 12వ రోజు సమ్మె సందర్భంగా సోమవారం రాసారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ 12 రోజులుగా సఫాయి కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన పోరాటం చేస్తున్న సఫాయి సిబ్బంది సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రల మానుకోవాలని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం పారిశుధ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి వహించడం బాధ్యతరాహిత్యమని అన్నారు. వెంటనే సమ్మె డిమాండ్లను పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీన్ కుమార్, మేకల ఆంజనేయులు, సుంకరి శ్రీనివాస్, లక్ష్మణ్ నరేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.