గీత కార్మికులకు సేఫ్టీమోకులు వెంటనే అందించాలి..

– చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజుగౌడ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ సమావేశం పాండాల మైసయ్య అధ్యక్షతన వృత్తిదారుల భవన్ బుదవారం  భువనగిరిలో నిర్వహించారు.  ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా  చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్  మాటూరి బాలరాజు గౌడ్ హాజరై,  మాట్లాడారు.  గీతా కార్మికులకు అనేక ఏళ్లుగా వృత్తి చేస్తూ ప్రమాదాలకు లోనై ఏటా వందలాది మంది చనిపోతున్నారని ,వాటిని నివారించడానికి ప్రభుత్వం సేఫ్టీ మోకులు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని ,వెంటనే గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికులను రక్షించాలని డిమాండ్ చేశారు .  గత రెండు సంవత్సరాలుగా తాటి చెట్ల  పైనుండి పడి మరణించిన, శాశ్వత వికలాంగులైన,  గీత కార్మికులకు.  రావలసిన ఎక్స్  గ్రేషియా , మరియు గీతా కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన తాత్కాలిక పరిహారము ,వెంటనే అందించాలని    భువనగిరి మండలంలో  మంది చనిపోయిన. 12మంది మరియు ఎనిమిది మంది శాశ్వత వికలాంగులైన వారు ,తాత్కాలిక పరిహారము అందించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులకు ప్రభుత్వము వృత్తి పింఛన్లను ఇవ్వడంలో గత రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుందని.  50 సంవత్సరాలు నిండిన వృత్తి పింఛన్లకు అర్హులైన గీతా కార్మికులు రెండు సంవత్సరాలు పైబడి ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకొని కనులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని వెంటనే గీతా కార్మికులకు పెన్షన్లను ప్రభుత్వం ప్రకటించిన విధంగా ,పెంచి తక్షణమే రెగ్యులర్ గా పెన్షన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నూతనంగా గ్రామాలలో గీత వృత్తిలో పనిచేస్తున్న వారికి ,కొత్త సభ్యత్వము గుర్తింపు కార్డులు, ఇవ్వాలని ఎన్నికల కోడ్ పేరుతో ఆపివేసిన ,గీతా కార్మికులకు నూతన సభ్యత్వాలనే తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వము గీతా కార్మికులకు ఇస్తానన్న ఉచిత బైక్ లను ప్రతి గీత కార్మిక కుటుంబానికి అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జూలై,ఆగస్టు మాసాలలో అమరుల  యాది లో కల్లుగీత కార్మిక ఉద్యమంలో, వృత్తి రక్షణ సంక్షేమం కొరకు హక్కుల కొరకు పోరాడిన, మహనీయులనారు. బొమ్మగాని ధర్మభిక్షం, తొట్లమల్సూరు,, బైరుమల్లయ్య, సూదగాని యెట్టయ్య, లాంటి అనేకమంది అమరవీరులని ,సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ గ్రామ గ్రామాన కల్లుగీత కార్మిక ఉద్యమంలో అమరులైన మహనీయులని, జ్ఞాపకం చేసుకుంటూ సభలు నిర్వహించనున్నామని వీటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పాండాల మైసయ్య, మట్ట బాలరాజు, రంగా కొండల్, గడ్డమీది సోములు, కొండ అశోక్, మచ్చ భాస్కర్
లు పాల్గొన్నారు.