భద్రతే ప్రామాణికం

ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే నిర్వహణలో ఖచ్చితంగా అన్ని భద్రతా విధానాలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. మంగళవారం గుంతకల్‌ రైల్‌ క్లబ్‌లో జరిగిన భద్రతా సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులందరి మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. సదస్సులో గుంతకల్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కే వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.