వ్యాక్సిన్ల భద్రత, శీతలీకరణ పద్ధతులు సక్రమంగా నిర్వహించాలి.. 

Safety and refrigeration methods of vaccines should be maintained properly.నవతెలంగాణ – డిచ్ పల్లి
వ్యాక్సిన్ల భద్రత, శీతలీకరణ పద్ధతులు సక్రమంగా నిర్వహించాలని ఫార్మసిస్ట్ విజయలక్ష్మికి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ అదేశించారు.శనివారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా చిన్న పిల్లలకు ఇచ్చే జాతీయ వ్యాధి  నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. శనివారం టీకాలు ఇచ్చే సెషన్లు ఎన్ని వాటి వివరాలు  అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ల భద్రత మరియు శీతలీకరణ పద్ధతులు సక్రమంగా నిర్వహించాలని ఫార్మసిస్ట్ విజయలక్ష్మికి సూచించారు చిన్న పిల్లలకి ఇచ్చే బీసీజీ ఈ వ్యాక్సిన్ క్షయ వ్యాధి రాకుండా ఉపయోగపడుతుందని, హెపటైటిస్ బి వ్యాక్సిన్ పచ్చ కామెర్లు రాకుండా ఉపయోగపడుతుందని వివరించారు. ఓ పి వి ఐపివి ఇవి పోలియో వ్యాధి రాకుండా కాపాడుతుందని, పి సి వి ఇది నుమోనియా వ్యాధి రాకుండా సైతం కాపాడుతుందని పేర్కొన్నారు. డి పి టి ఇది డిఫ్తీరియా , కంఠ సర్పి ధనుర్వాతము పెంటా వ్యాక్సిన్ మరియు రోటా వైరస్ ఇది డయేరియా రాకుండా, ఎం .ఆర్. ఇది తట్టు వ్యాధి, రుబెల్లా, జె.ఈ, ఇది మెదడువాపు వ్యాధి రాకుండా కాపాడుతుందని వివరించారు. ఈ విధంగా చిన్న  చిన్న పిల్లలలో ఇలాంటి వ్యాధులు రాకుండా ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కాపాడడానికి ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందని వీటిని తయారీదారు నుండి వినియోగదారుని వరకు కోల్డ్ చైన్ సిస్టం మంచిగా మైంటైన్ చేయాలని సూచించారు. వ్యాక్సిన్ కు సంబంధించి స్టాక్ రిజిస్ట్రార్ సరిగా సరిచేయాలని తెలిపారు. టీకా లబ్ధిదారుల చిన్నపిల్లల రిజిస్ట్రార్ దగ్గర ఉంచుకోవాలని, వారికి తగు సమాచారం ఇచ్చి లబ్ధిదారులకు టీకాలు అందేలా చూడాలని ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ కు ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని చెప్పారు. ప్రతి వ్యాక్సిన్ పై గల వి .వి. ఎం. అనగా “వ్యాక్సిన్ వాయల్ మానిటర్” ను పరిశీలించి ప్రతి వ్యాక్సిన్ పై ఉపయోగించిన సమయం తేదీని ఖచ్చితంగా మార్కర్ తో వేయాలని తెలిపారు. టీకాలు వేసిన ప్రతి శిశువును డేటాను యు.విన్ యాప్ లో నమోదు చేయాలని ప్రతి ఒక్కటి ఆన్లైన్లో నమోదు జరగాలని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ క్యారియర్ లో గల నాలుగు ఐస్ ప్యాకులు శీతలీకరణ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ,ఫార్మసిస్ట్ విజయలక్ష్మి ,ఆనంద్ ,స్వరూప విట్టల్ పాల్గొన్నారు.