సాగర్ వరద కాలువకు గండి…

– అనుముల మండలం మారెపల్లి వద్ద వరద కాల్వకు  భారీ గండి
– నీటి విడుదలను  నిలిపివేసిన నీటి పారుదల శాఖ అధికారులు
నవతెలంగాణ -పెద్దవూర
అధికారుల నిర్లక్ష్యం వల్ల నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వరద కాలువకు రాత్రి అనుముల మండలం మారేపల్లి వద్ద భారీ గండి పడింది. దీంతో ఏఏంఆర్పీ ఈఈ ఖదీర్ వరద కాలువకు నీటివిడుదల నిలిపి వేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల విడుదల చేసిన మూడు రోజులకే గండి పడింది. నీటివిడుదలకు ముందు అధికారులు  కంపచెట్లు, బండ రాళ్లు తొలగించక పోవడంతో గండి పడిందని రైతులు ఆవేదన చెందు తున్నారు. ఈ కాలువకు  ఈ నెల 2నరాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి  నీటిని విడుదల చేశారు.వరద కాలువ 85 కిలోమీటర్లు, 36 డిస్ట్రిబ్యూటరీ కాలువలు వున్నాయి.వీటి పరిధిలో 80 వేల ఎకరాలకు సాగునీళ్లు అందించే విదంగా మరియు 200 చెరువులను నింపడం, 250 గ్రామాలకు తాగు నీళ్లు అందుతున్నాయి. ఇంత ప్రాముఖ్యత వున్న ఈ మెయిన్ వరద కాలువల, డిస్ట్రిబ్యూటరీలు అస్తవ్యస్తంగా వున్నాయి. కంప చెట్లు, బండరాళ్లతో నిండి వుంది.ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు. వేసవిలో కాలువల స్థితిగతులను పరిశీలించి మరమ్మత్తులు చేయించాల్సిన అధికారులు నీళ్లు విడుదల చేసే వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టిన పాపాన పోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో చెట్లు బండరాళ్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంలా వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని విడుదల చేసిన ప్రభుత్వం చివరి వరకు నీళ్లుఅందుతాయా అనేది పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికైన కాలువల్లో నీళ్లుకు ఎలాంటి అడ్డంకి లేకుండా సూసి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకున్న ఫలితం లేకుండా పోయింది. దీంతో గండి పడడంతో నీటి విడుదల నిలిపివేయడం జరిగింది. నవతెలంగాణ లో వచ్చిన వరద కాలువల్లో కంపెచెట్ల తొలగించాలని వచ్చిన వరుస కథనాలు అధికారులదృష్టికి వెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైన సంభందితఅధికారులు త్వరిత గతిన గండి పూడ్చి శాశ్వవత పరిష్కారం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. గత రెండేళ్లుగా సాగర్ డ్యామ్ నిండక వ్యవసాయంలో వెనుక బడి వున్న రైతులకు సాగర్ జలాశయం నిడదం తో ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆ ఆనందం విడుదల చేసిన ఐదు రోజులకే చెల్లా చేదురై పోయింది.వరద కాలువకు గండి పడడం తో రైతులకు కొంతకాలం ఇబ్బందులు తప్పవు.
రెండు, మూడు రోజుల్లో మరమ్మత్తులు చేపట్టి నీటి విడుదల చేస్తాము..ఏఎంఆర్పీ జేఈ మల్లయ్య
సోమవారం రాత్రి అనుముల మండలం మారేపల్లి వద్ద వరద కాలువకు గండి పడింది. రైతుల ద్వారా విషయం తెలుసుకున్నాము. వెంటనే నీటివిడుదల నిలిపి వేశాము.అక్కడికి జిల్లా నీటి పారుదల అధికారులు, ఏఎం ఆర్పీ ఎస్ ఈ  నాగేశ్వర్ రావు అక్కడికి వెళ్లారు. పరిశీలిస్తున్నారు.రెండు మూడు రోజుల్లో మరమత్తులు చేపట్టి నీటి విడుదల చేస్తాము. రైతులు ఆందోళన పడొద్దు పనులు ప్రారంబిస్తాము.