– సొమ్ము చెల్లింపులు ప్రారంభం
న్యూఢిల్లీ: సహారా గ్రూపున కు చెందిన నాలుగు సంస్థలు ప్రజల నుంచి అక్రమంగా నిధులు సమీకరించిన మొత్తాన్ని ఎట్టకేల కు కేంద్రం తిరిగి చెల్లించడం ప్రా రంభించింది. సహారా కోపరేటివ్ సొసైటీల్లో దాచుకున్న నగదు డిపాజిటర్లకు తిరిగి ఇచ్చే ప్రక్రియను శుక్రవారం కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. తొలి విడతలో 112 మంది డిపాజిట్లకు రూ. 10వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. రాబోయే రోజుల్లో డిపాజిటర్లు క్లెయిమ్ చేసిన మొత్తం నగదును పొందుతారని అమిత్ షా తెలిపారు. డిపాజిటర్లు కామన్ సర్వీసు సెంటర్లలో తమ పేర్లను నమోదు చేసుకో వాలని ఇటీవలే కేంద్రం సూచించింది. సహారా సంస్థలు నిబంధనలకు విరుద్దంగా 10 కోట్ల మంది పైగా డిపాజిట్‌దారుల నుంచి దాదాపు రూ.25వేల కోట్లు మేర నిధులు సమీకరించిన విషయం తెలిసిందే.