వికలాంగుల హక్కుల కోసం సాయిబాబా పోరాటం

– ఎన్‌పీఆర్‌డీ నివాళులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
డాక్టర్‌ జి ఎన్‌ సాయిబాబా మృతి పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె వెంకట్‌, ఎం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్‌ వెంకటేశ్‌, టీఎంకెేఎంకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ బృందం సాయిబాబా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ తప్పుడు కేసు లు పెట్టి పాలకులు జైల్లో పెట్టారనీ, నాటి నుంచి న్యాయం కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. ముంబై హైకోర్ట్‌ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింద న్నారు. వైకల్యం ఉన్న సాయిబాబాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ, అవి సంక్లిష్టంగా మారాయని తెలిపారు.