నీట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాయి దిశ్విత..

నవతెలంగాణ – తుంగతుర్తి
మంగళవారం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఎడ్ల సాయి దిశ్విత ప్రతిభ కనబరిచారు.నీట్ పరీక్షలో సాయి దిశ్విత కు 720 మార్కులకు 657 మార్కులు వచ్చాయి.ఆలిండియా స్థాయిలో 23303 వ ర్యాంకు,కేటగిరిలో 491వ ర్యాంకు సాధించి ప్రతిభ చూపారు.సాయి దిశ్విత ప్రాథమిక విద్యను హుజూర్నగర్ లో ఉన్నత విద్యను సూర్యాపేట జయ స్కూల్లో ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ హైదరాబాదులో పూర్తి చేశారు.జాతీయస్థాయిలో 98.97 పర్సంటైల్ తో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సాయి దీష్వితను బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పలువురు అభినందించారు.సాయి దిశ్విత తల్లిదండ్రులు ఎడ్ల గోపయ్య,శారద ఇద్దరు తుంగతుర్తి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన సాయి దిశ్విత మాట్లాడుతూ ఏరోజు సిలబస్ ఆరోజే పూర్తి చేసి పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీ చేసి మాక్ టెస్ట్ లు రాయడం వల్ల మాలో మాకు పోటీ ఉండేదని గ్రూప్ స్టడీ ఎంతో సహకరించిందని తెలిపారు.ప్రశ్నను చదవడం అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయొద్దని సూచించారు.తన తల్లిదండ్రులు ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చి దిద్దుతున్నారని,తాను మాత్రం కార్డియాలజీ పూర్తి చేసి పేద ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యం అన్నారు.