సీఎం కప్‌ పోటీలకు సై

CM cup Psy for competitions– నేటి నుంచి 36 క్రీడాంశాల్లో
– రాష్ట్ర స్థాయి పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : సీఎం కప్‌ 2024 పోటీలు ఆఖరు ఘట్టానికి చేరుకున్నాయి. పల్లె ప్రతిభకు పట్టం కట్టాలనే లక్ష్యంగా మొదలైన ఈ పోటీలు ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీలను పూర్తి చేసుకున్నాయి. శుక్రవారం నుంచి 36 క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు ఆరంభం కానున్నాయి. రాష్ట్రంలోని పలు క్రీడా వేదికల్లో సమాంతరంగా ఈ పోటీలు నిర్వహించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌) ఏర్పాట్లు చేసింది. క్రీడా పోటీలను పర్యవేక్షించేందుకు ఎల్బీ స్టేడియంలో కంట్రోల్‌ సెంటర్‌ను సిద్ధం చేసింది. 36 క్రీడాంశాలకు తోడు పారా క్రీడల్లో నాలుగు క్రీడాంశాల్లో పోటీలు జరుపుతున్నారు. పారా క్రీడలకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిలువనుండగా..వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ సహా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని క్రీడా వేదికల్లో ఈ పోటీలకు రంగం సిద్ధమైంది.
రాష్ట్ర స్థాయి క్రీడాంశాలు : అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, షూటింగ్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, యోగా, సెపక్‌తక్రా, చెస్‌, బేస్‌బాల్‌, నెట్‌బాల్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌, సైక్లింగ్‌, రోయింగ్‌, స్క్వాష్‌, కానోయింగ్‌-కయాకింగ్‌, వుషూ, అట్య పట్య, పవర్‌లిఫ్టింగ్‌, సాఫ్ట్‌బాల్‌, తైక్వాండో, జూడో, బిలియర్డ్‌-స్నూకర్‌. పారా గేమ్స్‌ : అథ్లెటిక్స్‌్‌, సిట్టింగ్‌ వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, వీల్‌ చైర్‌ బాస్కెట్‌బాల్‌.