ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో,హీరోయిన్లుగా నటించిన సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బార్సు అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. నిర్మాత ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కథను ఎంతబాగా చెప్పారో అంతకంటే బాగా రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్. ఒక మంచి మూవీతో మీ ముందుకు ఈ నెల 27న వస్తున్నాం. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం’ అని తెలిపారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. మా ప్రొడ్యూసర్ బసవరాజు లహరిధర్ వాళ్ల నాన్న శ్రీనివాస్‌కి చిరంజీవి మంచి మిత్రులు. నేను ఈ కథను శ్రీనివాస్‌కి చెప్పినప్పుడు చిరంజీవికి చెబుదాం ఆయన ఒపీనియన్ తీసుకుందాం అన్నారు. ఆ తర్వాత ఈ కథ చాలా బాగుందని చిరంజీవికి జీకే మోహన్ మెసేజ్ పంపిస్తే ఆయన ఓకే అని రిప్లై ఇచ్చారు. అలా మెగాస్టార్ అంగీకారంతో ఈ సినిమాని తెరకెక్కించాను’ అని దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి చెప్పారు.