జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు సైదాపూర్  మోడల్ స్కూల్ విద్యార్థి ఏంపిక

నవతెలంగాణ – సైదాపూర్
డిసెంబర్ 26 నుంచి 30వ వరకు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జరిగిన 67వ జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 బాలుర విభాగంలో జాతీయస్థాయి అథ్లెటిక్  హైమర్ త్రో ఈవెంట్ పోటీల్లో సైదాపూర్ మండలం సోమవారం మోడల్ స్కూల్ విద్యార్థి సుంకే వంశీ జాతీయ స్థాయిలో ఏడవ స్థానం  సాధించడం జరిగింది.విద్యార్థి సుంకే వంశీని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫర్హానా, వైస్ ప్రిన్సిపాల్ మోయిస్ ,ఫిజికల్ డైరెక్టర్ ఉయ్యాల విష్ణు వర్ధన్,  పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.