యాచారం పోలీస్‌ స్టేషన్‌ సిఐగా సైదయ్య

– యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్కు సిఐ లింగయ్య బదిలీ
– ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీస్‌ సిబ్బంది
– ప్రజలకు అందించిన సేవలు మరువలేనివి
నవతెలంగాణ-యాచారం
రాచకొండ సిపి చౌహన్‌ పలువురి ఇన్స్పెక్టర్లను సోమవారం బదిలీ చేసిన విషయం పాఠకులకు విధితమే. బుధవారం యాచారం పోలీస్‌ స్టేషన్‌ సీఐగా సైదయ్య ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఇక్కడ పనిచేస్తున్న సిఐ లింగయ్య యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ కు బదిలీ అయ్యారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన సిఐ లింగయ్య ఆయనకు ఉద్యోగ బాధ్యతలు అప్పగించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్లో బదిలీ అయిన సిఐ కి ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీస్‌ సిబ్బంది పట్ల ఆయన చూపించిన ఆత్మ అభిమానాన్ని, కనబరిచిన ప్రేమను వారు కొనియాడారు. అనంతరం పోలీస్‌ స్టేషన్లో ఘనంగా సన్మానించి సిఐ లింగయ్య కు వీడ్కోలు పలికారు. ఈయన దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు యాచారం మండల ప్రజలకు సీఐగా సేవలు అందించారు. ఆయన ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని పలువురు ప్రజాప్రతినిధు లు, రాజకీయ నాయకులు కొనియాడారు.