సైంధవ్‌ క్లైమాక్స్‌ పూర్తి

Saindhav complete climaxవెంకటేష్‌, శైలేష్‌ కొలను కాంబి నేషన్‌లో నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ ‘సైంధవ్‌’. తన తొలి చిత్రం ‘శ్యామ్‌ సింగరారు’ని లావిష్‌గా నిర్మించి సినిమాపై తనకున్న ప్యాషన్‌ను నిర్మాత వెంకట్‌ బోయనపల్లి చూపించారు.
‘సైంధవ్‌’ వెంకటేష్‌ 75వ మైల్‌ స్టోన్‌ మూవీ. మేకర్స్‌ చాలా జాగ్రత్తలు తీసుకొని రాజీపడకుండా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా 16 రోజులలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు, ఎనిమిది మంది ముఖ్య నటీనటులు షూట్‌లో పాల్గొన్న హై-ఆక్టేన్‌ ఎమోషనల్‌ క్లైమాక్స్‌ను హర్ష్‌ కండీషన్స్‌లో చిత్రీకరిం చారు. యాక్షన్‌ ఎపిసోడ్‌ను రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ సూపర్‌ వైజ్‌ చేశారు. వెంకటేష్‌కి ఇప్పటి వరకు ఇదే మోస్ట్‌ ఎక్స్‌పెన్సివ్‌ క్లైమాక్స్‌ పోర్షన్‌. సినిమా రూపుదిద్దు కుంటున్న తీరు పట్ల చిత్ర బందం ఆనందంగా ఉంది. నవాజుద్దీన్‌ సిద్ధిక్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారాతో సహా దాదాపు అన్ని ప్రధాన పాత్రలను మేకర్స్‌ ఇప్పటికే పరిచయం చేశారు. ఈ పాన్‌ ఇండియా మూవీని అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలో డిసెంబర్‌ 22న క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : శైలేష్‌ కొలను, సంగీతం: సంతోష్‌ నారా యణ్‌, సహ నిర్మాత: కిషోర్‌ తాళ్లూరు, డీవోపీ: ఎస్‌.మణికందన్‌, ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా.