వెంకటేష్ నటించిన తన 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయన పల్లి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి రావడం ఆనందంగా ఉంది. దేశ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొంది నప్పటికీ తెలుగులోకి రావడానికి ఆలస్యమైంది. ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తాడు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశాను. అది ‘సైంధవ్’తో కుదిరింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. వెంకటేష్‌తో కలసి పని చేయడం ఎవరికైనా ఒక డ్రీమ్. పైగా ఆయన ల్యాండ్ మార్క్ 75వ సినిమాలో నటించటం ఆనందంగా ఉంది. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చు కున్నాను. ఇందులో ప్రతి నాయ కుడిగా నటించాను. ఈ సినిమా కోసం దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్‌ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం ఉన్న పాత్ర. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా. ఈ విషయంలో శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇందులో నాది హైదరాబాదీ పాత్ర. హిందీ, తెలుగు రెండూ మాట్లాడతాను. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. శైలేష్ చాలా ప్రొఫిష నల్ డైరెక్టర్. తనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్‌లో ఉంటుంది. కథని ఎంత బాగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశాడు. నిహారిక సంస్థ చాలా ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్. ఈ ప్రొడక్షన్లో మళ్ళీ చేయాలని ఉంది’ అని అన్నారు.