వెంకటేష్ నటిస్తున్న తన 75 వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 13న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ,’ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. 75వ చిత్రంగా ‘సైంధవ్’ లాంటి సినిమా చేయడం అదష్టం. దర్శకుడు, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ మా టీం అంతా అద్భుతంగా వర్క్ చేశారు. మా నిర్మాతలు సినిమాకి కావాల్సిన ప్రతీదీ సమకూర్చారు. మంచి ఎమోషన్‌తో న్యూ ఏజ్ యాక్షన్‌తో ఫాస్ట్ పేస్డ్ ఫిలిం ఇది. 15వ నిమిషం నుంచే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్ అవుతారు. ఇది నా కెరీర్‌లో ఒక బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి రియల్ ట్రీట్’ అని అన్నారు. ‘వెంకటేష్ 75వ చిత్రం చేయడం అదష్టంగా భావిస్తున్నాను. ట్రైలర్‌లో కథ చెప్పేశాను. ఇంత ధైర్యంగా కథ చెప్పానంటే సినిమా లోపల ఎంత ఉందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నాను. ఇది నా బెస్ట్ ఫిల్మ్. వెంకీ మామ సినిమా అంటేనే పండగ. ఈ పండక్కి అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. సినిమా చూసి ఎంజారు చేయండి’ అని డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పారు. ఈ వేడుకలో గెటప్ శ్రీను, చైతన్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, డీవోపీ: యస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటర్: గ్యారీ బిహెచ్.
వెంకటేష్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఇలాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడం నా అదష్టం. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయన నాకు స్ఫూర్తి. ఆయనతో సినిమా చేయడం కల నేరవేరినట్లయ్యింది. అందరూ ఈనెల 13న సినిమా చూడండి. సినిమా విందు భోజనంలా ఉంటుంది.
– నిర్మాత
వెంకట్ బోయనపల్లి